అమ్మా, నాన్న త‌ర్వాత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ః క‌రుణాక‌రన్

245
Karunakaran
- Advertisement -

సుప్రీమ్ స్టార్ సాయి ధ‌రమ్ తేజ్, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన సినిమా తేజ్ ఐ ల‌వ్ యూ. తొలిప్రేమ చిత్రం లాంటి బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ ఇచ్చిన క‌రుణాక‌ర‌న్ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై కే.ఎస్ రామారావు నిర్మించారు. ఈసినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను ఇటివ‌లే విడుద‌ల చేశారు. ఈట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. జులై 6వ తేదిన ఈసినిమా ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

tej i love u team

ఈమూవీకి సంబంధించి ప్ర‌మోష‌న్స్ కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. ఈసంద‌ర్భంగా నిన్న భీమ‌వ‌రం విష్ణు కాలేజీలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ను ఏర్పాటు చేశారు. ఈకార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ క‌రుణాక‌ర‌న్, సాయి ధ‌ర‌మ్ తేజ్, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ జోష్ ర‌వి ప‌లువురు సెల‌బ్రెటీలు పాల్గోన్నారు. ఈసంద‌ర్భంగా డైరెక్టర్ క‌రుణాక‌ర‌ణ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

Tej-i Love u

నా తొలి సినిమాకు అవ‌కాశం ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు అమ్మా నాన్న‌తో స‌మానం అన్నారు. ఇండ‌స్ట్రీలో నాకు దారి చూపించిన దేవుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నన్ను ప్రోత్స‌హించిన నిర్మాత‌లు, హీరోలు, నా మిత్రుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేసిన తొలిప్రేమ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో..ఇప్పుడు నా త‌మ్ముడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో తీసిన తేజ్ ఐ ల‌వ్ యూ సినిమా కూడా అంతే పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్నారు. అన్న‌య్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో ప‌నిచేస్తున్న‌పుడు ఎలా అనిపించిందొ..నా త‌మ్ముడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో ప‌నిచేస్తుంటే కూడా అలానే అనిపించింద‌న్నారు. ఈసినిమాపై హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్, డైరెక్ట‌ర్ క‌రుణాక‌ర‌న్ చాలా ఆశ‌లు పెట్టుకున్నారు.

- Advertisement -