చిరు అల్లుడిపై.. చిన్నబాబు అటాక్..

224
kalyan dev

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’ చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. మొదటి సినిమా కావడంతో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగానే మెగా హీరోలు సైతం సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. జూలై 12న ఈ సినిమా విడుదల కానుంది. కానీ అదే రోజు మరో రెండు సినిమాలు విడుదల కావడంతో కల్యాణ్ దేవ్ గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తోంది.

vijtha and chinna babu and rx 100

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు కార్తీ. తాజాగా ఆయన నటించిన ‘చిన్నబాబు’ సైతం జూలై 12న విడుదల కానుంది. ఊపిరి, ఖాకీ వంటి సినిమాలతో తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాడు. ఇక రైతుల కథాంశంతో వస్తున్న ‘చిన్నబాబు’తో కార్తీ మరో హిట్ కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని పెంచేశాడు కార్తీ.

vijetha-విజేతకు పోటీగా అదే రోజు మరో సినిమా రానుంది. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో కొత్త చిత్ర బృందం వెండితెరకు పరిచయం కానుంది. వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొత్త వాళ్లే అయినప్పటికే ప్రోమోలతో, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని కల్గిస్తున్నారు. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.

మెగా ఇమేజ్ కి తగ్గట్టుగా కల్యాణ్ బాక్సీఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాడా..? తనతో పోటీకి వస్తున్న, రెండు సినిమాలకు గట్టి పోటీ ఇస్తాడా..? విజేతకు, చిన్నబాబు ఎఫెక్ట్ పడనుందా.. ఇలాంటి సందేహాలకు సమాధానం తెలియాలంటే జూలై 12 వరకు వేచి చూడాల్సిందే.