ప్రధానమంత్రి నరేంద్రమోడీని రూ. 50 కోట్లిస్తే చంపేస్తానని బీఎస్‌ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ మాట్లాడినట్లు బీజేపీ నేతలు ఓ వీడియోను బయటపెట్టారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో స్పందించారు తేజ్ బహదూర్. ఈ వీడియోలో ఉన్నది తానేనని కానీ ఏనాడూ మోడీని చంపుతా అనలేదన్నారు. 2017లో ఈ వీడియో తాను ఢిల్లీలో ధర్నా చేసే సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ చిత్రీకరించాడని చెప్పారు. ఆ సమయంలో తాను అనేక సమస్యల గురించి మాట్లాడా కానీ ఏనాడూ ప్రధానిని హత్య చేస్తానని చెప్పలేదన్నారు.
మరోవైపు యూపీలోని వారణాసి నుండి తన నామినేషన్ తిరస్కరించడంపై సుప్రీంను ఆశ్రయించారు తేజ్ బహదూర్. తొలుత ఇండిపెండెంట్‌గా ఆయన పోటీచేసేందుకు ఆసక్తిచూపగా అనూహ్యంగా ఎస్పీ బీ ఫామ్‌ను అందజేసింది. అయితే తేజ్ బహదూర్ నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం అధికారులు ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.
“आतंकियों के साथ दारू पिया हुआ हूँ” ~ तेज़ बहादुर , बीएसएफ़ ने नौकरी से निकाल दिया ओर जिसे महाठगबंधन ने गले लगा पीएम के सामने वाराणसी से उम्मीदवार बनाया था! pic.twitter.com/GGkcODJIhx
— Suresh (@SureAish) May 6, 2019