తీన్మార్ మల్లన్న అరెస్ట్..

64
mallanna

బ్లాక్ మెయిల్ చేసిన కేసులో చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేయగా ఈ కేసులో చిలకలగూడ పోలీసులు శుక్రవారం మల్లన్నను అరెస్ట్ చేశారు.

చిల‌క‌ల‌గూ‌డకు చెందిన సన్ని‌ధానం లక్ష్శీ‌కాం‌త‌శర్మ మారుతీ సేవా సమితి పేరుతో జ్యోతి‌ష్యా‌ల‌యాన్ని నిర్వ‌హి‌స్తు‌న్నారు. కొందరు భక్తుల రూపంలో ఆయ‌న‌వ‌ద్దకు వెళ్లి సమ‌స్యలు సృష్టిస్తూ సోష‌ల్‌‌మీ‌డి‌యాలో అవా‌స్త‌వాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. తప్పుడు ప్రచారం ఆపా‌లంటే రూ.30 లక్షలు ఇవ్వా‌లని బ్లాక్‌‌మె‌యి‌లిం‌గ్‌కు దిగాడు. దీంతో జ్యోతిష్యుడు శర్మ తన ప్రతి‌ష్ఠను దెబ్బ‌తీ‌సేలా యూట్యూబ్‌ చానల్స్‌, ఎల‌క్ర్టా‌నిక్‌ మీడి‌యాలో ప్రచారం చేశా‌రంటూ మల్ల‌న్నపై ఏప్రిల్‌ 20న చిల‌క‌ల‌గూడ పోలీ‌సు‌లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు పక్కా ఆధా‌రా‌లుం‌డ‌టంతో మల్ల‌న్నను అరెస్ట్‌ చేశారు.