శ్రీదేవి సోడా సెంటర్….మహేష్ రివ్యూ

65
mahesh

70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’.ఈ నెల 27న(శుక్రవారం) సినిమా ప్రేక్షకుల ముందుకురాగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రిన్స్ మహేష్ బాబు.

శ్రీదేవి సోడా సెంటర్ క్లైమాక్స్ రా, ఇంటెన్స్, హార్డ్ హిట్టింగ్. పలాస 1978 తర్వాత దర్శకుడు కరణ్ కుమార్ మరో బోల్డ్ చిత్రంతో వచ్చాడు. సుధీర్ బాబు బ్రిలియంట్. ఇప్పటి వరకు ఎన్ని నటించిన సినిమాలలో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్. నరేష్ ది మరో గుర్తుండిపోయే పాత్ర, పర్ఫామెన్స్. ఆనంది శ్రీదేవి పాత్రలో ఒదిగి పోయింది. ఆ పాత్రకు సరిగ్గా సరిపోయిందని పేర్కొన్నారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు. మరోసారి చిత్రబృందం మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్ అంటూ పేర్కొన్నారు.