టీమిండియాకు గ్రాండ్‌ వెల్‌కం..

67
teamindia

బ్రిస్బేన్‌లో ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత జట్టుపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిపించారు. కాగా, ఆస్ట్రేలియా టూర్‌ను ఘ‌నంగా ముగించిన ఇండియ‌న్ టీమ్ స‌భ్యులకు సొంత‌గ‌డ్డ‌పై ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. గురువారం తెల్ల‌వారుఝాము నుంచి టీమ్ స‌భ్యులు ఒక్కొక్క‌రుగా స్వ‌దేశానికి వ‌స్తున్నారు. కెప్టెన్ అజింక్య ర‌హానే, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ ర‌విశాస్త్రి, ఓపెన‌ర్ పృథ్వి షా ముంబైకి చేరుకున్నారు.

అటు బ్రిస్బేన్ టెస్ట్ హీరో రిష‌బ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ నిల‌బెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని ఎయిర్‌పోర్ట్‌లో మీడియాలో మాట్లాడిన పంత్ అన్నాడు. సిరీస్ మొత్తం ఆడిన‌ తీరుపై టీమ్ అంతా సంతోషంగా ఉన్న‌ద‌ని చెప్పాడు. కాగా, చివ‌రి టెస్టులో పంత్ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌లో 13వ ర్యాంక్‌కు ఎగ‌బాకాడు.