దేశంలో కొత్తగా 15,223 మందికి కరోనా..

43
corona

దేశంలో గత 24 గంటల్లో 15,223 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 151 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,869కు పెరిగింది. ఇక 19,965 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,10,883కు చేరింది. అలాగే మొత్తం 1,02,65,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, 1,92,308 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 8,06,484 మందికి వ్యాక్సిన్లు వేశారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.