టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. పాల్ఘర్‌లోని చరోతి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి ముంబాయి వెళ్తుండగా ఈఘటన జరిగింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సూర్య నదిపై ఉన్న వంతెనపై ఉన్న డివైడర్‌ను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం గుజరాత్‌కు తరలించారు.
సైరస్ పల్లోంజీ మిస్త్రీ ఒక వ్యాపార కుటుంబంలో 1968 జూలై 4 న జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్ నుంచి ప్రాథమిక విద్యను, లండన్ ఇంపీరియల్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ పట్టా అందుకున్నాడు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు. సైరస్ మిస్త్రీ 2012 డిసెంబర్ 28 న టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమితులయ్యారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా వైదొలిగిన తర్వాత 2012 నుంచి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా కొనసాగాడు. 2016 అక్టోబర్ 24 న చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ తొలగించింది.