ఆస్పత్రిలో నటి రంభ.. ఏమైంది.?

115
- Advertisement -

ప్రముఖ నటి రంభ వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. కెనడాలో ఉంటున్న ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హీరోయిన రంభ తన పిల్లలను కారులో స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా మరో వాహనం ఢీకొట్టింది. చాలా కాలం పాటు దక్షిణాది భాషల్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను చేసిన ఈ భామ.. వివాహం తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. ఆ తర్వాత భర్తతో కెనడాలో సెటిల్ అయింది.

అయితే కెనడాలో ఉంటున్న ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారులో వెళ్తున్న ఆమెను వేరే వాహనం ఢీ కొట్టడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆమె కుమార్తే మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని సదరు నటి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.

- Advertisement -