కరోనాతో తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి మృతి..

303
tamilnadu
- Advertisement -

తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారీన పడగా తాజాగా ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దురైకన్ను కరోనాతో తుదిశ్వాస విడిచారు.

అక్టోబరు 13న కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో తొలుత విల్లుపురం ప్రభుత్వ ఆస్పత్రికి తర్వాత మెరుగైన చికిత్స కోసం కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే ఆయనకు చికిత్స కొనసాగుతుండగా.. శనివారం నుంచి పరిస్థితి విషమించింది.దీంతో ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు.

2006 , 2011, 2016లలో తిరునల్వేలీ జిల్లాలోని పాపనాశం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దొరైక్కన్నుకు భార్య, నలుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

నిరాంబడరత, వినయం, ముక్కుసూటితనం, పాలనా నైపుణ్యాలు, రైతుల సంక్షేమం పట్ల నిబద్ధత ఆయన సొంతం.. వ్యవసాయ మంత్రిత్వ శాఖను పూర్తి అంకితభావంతో నిర్వహించి బలమైన ముద్ర వేశారని తమిళనాడు గవర్నర్ తెలిపారు.

- Advertisement -