- Advertisement -
తమిళనాడులో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో నేటి నుండి 14 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ అమల్లోకి రాగా అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు.
ఈ నెల 24 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండనుండగా ప్రజలంతా సహకరించాలని సీఎం స్టాలిన్ కోరారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించ వద్దని…అప్పుడే కరోనాను జయించవచ్చని తెలిపారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మూడో రోజే స్టాలిన్ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు.
- Advertisement -