దేశంలో ఈ రాష్ట్రాల్లో సీబీఐకి నో ఎంట్రీ..

44
- Advertisement -

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి రాష్ట్రాల హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్న సంగతి తెలిసిందే.తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలపై దర్యాప్తు సంస్థలను వాడుతు కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందనే అపవాదు ఉంది మోడీ సర్కార్‌పై. దీనికి ఉదాహరణ అనేక రాష్ట్రాల్లో ఆయా బీజేపీ వ్యతిరేక పార్టీలు, ప్రజాప్రతినిధులపై ఈడీ,సీబీఐ,ఐటీ రైడ్స్ పేరుతో హంగామా చేస్తోంది.

తాజాగా తమిళనాడు మంత్రి వి.సెంధీల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తనదైన మార్క్ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోకి సీబీఐకి నో ఎంట్రీని ఒకవేళ రావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు.

Also Read:మళ్లీ సంక్రాంతి బరిలో చిరు!

చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సాధారణ సమ్మతిని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లుగా స్టాలిన్ ప్రకటించారు. దీంతో స్టాలిన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

గతంలో మిజోరాం ,పశ్చి బెంగాల్ , ఛత్తీస్ గఢ్ ,రాజస్థాన్ ,మహారాష్ట్ర , కేరళ , జార్ఖండ్ , పంజాబ్ ,మేఘాలయ , తెలంగాణ రాష్ట్రాలు సీబీఐకి నో ఎంట్రీ అంటూ ఆదేశాలు ఇచ్చాయి.

Also Read:కంటి చూపు కాపాడుకోండిలా !

- Advertisement -