మళ్లీ సంక్రాంతి బరిలో చిరు!

59
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ , ఇతర నటీనటులందరిపై షూట్ చేస్తున్నారు.

అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read:లోక్‌సభలో ఇక నుంచి బీఆర్‌ఎస్‌

ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మరో సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో మెగాస్టార్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనుండగా చిరు కుమార్తె సుస్మిత గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుండగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుందట. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన చిరు..మరోసారి సంక్రాంతి బరిలో విజేతగా నిలుస్తాడో లేదో వేచిచూడాలి..

Also Read:బీజేపీ ” సినీ గాలం “.. వర్కౌట్ అవుతుందా ?

- Advertisement -