కోరి కష్టాలను తెచ్చుకుంటున్న బీజేపీ..!

182
tamilnadu bjp
- Advertisement -

తమిళనాడు ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ప్రధానంగా అధికార అన్నాడీఎంకే,ప్రతిపక్ష డీఎంకే మధ్య పోటీ నెలకొనగా సర్వేలన్నీ డీఎంకే వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ పేరు వాడకుండా అన్నాడీఎంకే నేతల పేర్లు వాడుతూ విమర్శల పాలవుతున్న బీజేపీ నేతలు తాజాగా కోరికోరి కష్టాలను తెచ్చుకుంటున్నారు.

తమిళనాడు సంస్కృతిని హైలైట్ చేయాలనే తపనతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌లోని భరత నాట్యానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది బీజేపీ పార్టీ. అయితే ఇప్పటివరకు భాగానే ఉన్న ఆ వీడియోలో భరత నాట్యం చేసిన డ్యాన్సర్‌ కాంగ్రెస్ సీనియర్ నేత,చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం భార్య శ్రీనిధి.

డీఎంకే దివంగత లీడర్ కరుణానిధి రాసిన పాటను కాంగ్రెస్ ఎంపీ భరత నాట్యం చేసిన వీడియోని షేర్ చేసి నవ్వుల పాలైంది. దీనిపై కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చింది. శ్రీనిధి చదంబరం నుండి ఎలాంటి అనుమతి తీసుకుని ఆమె చిత్రాన్ని ఉపయోగించి కపటబుద్దిని బయటపెట్టుకుంటున్నారని మండి పడింది. బీజేపీ క్యాంపెయిన్ అంతా అబద్దాలతో నిండిందని మండిపడగా దీనిపై శ్రీనిధి చిదంబరం కూడా అసహనం వ్యక్తం చేయగా ఆలస్యంగానైనా తప్పుదిద్దుకున్న బీజేపీ ఆ వీడియోని డిలీట్ చేసింది.

- Advertisement -