గ్యాస్ వినియోగదారులకు శుభవార్త

15
- Advertisement -

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. 19కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.7 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ 19కిలోల గ్యాస్ సిలిండర్ రేటు రూ. 1,804 నుంచి రూ. 1,797కు తగ్గింది.

కోల్ కతాలో రూ. 1907, ముంబైలో రూ. 1749.50, చెన్నైలో రూ. 1959.50, హైదరాబాద్ నగరంలో రూ. 2,023గా ఉంది. అయితే డొమెస్టిక్ ఇంట్లో వినియోగించే గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ ధర రూ. 803 వద్ద కొనసాగుతుంది. కోల్ కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, హైదరాబాద్ లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 855 గా ఉంది.

Also Read:నీళ్లపై రేవంత్ రెడ్డి నీచ రాజకీయం: కవిత

- Advertisement -