ఎన్టీఆర్ బయోపిక్‎లో మహేష్, కాజల్..

299
- Advertisement -

మహానటుడు, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్‎బాబుని నటించమని బాలయ్య అడిగారట. దీనికి సూపర్ స్టార్ మహేష్ కూడా ఆనందంగా అంగీకరించారని సీనీ ప్రియులు చెబుతున్నారు.

Tamil Nadu chief minister J Jayalalithaa's character In kajal

ఎన్టీఆర్ తో కలిసి పలు సినిమాలలో నటించిన స్వర్గీయ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయట. జయలలిత పాత్ర నటి కాజల్ను‎ సంప్రదించినట్లు తెలుస్తోంది. పాత్ర చిన్నదైనప్పటికీ, కీలకమైన పాత్ర కావడంతో అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సినీ ప్రియులు చెప్పుకుంటున్నారు. మరోవైపు జూ.ఎన్టీఆర్ కూడా తాతగారి బయోపిక్‎పై స్పందించాడు. ఆ టీమ్ నన్ను సంప్రదిస్తే తాతగారి బయోపిక్‎లో నటిస్తాని తెలియజేశారు. ఇంకా మిగతా పాత్రలో కోసం ఎంపిక కొనసాగుతుంది.

ఇటీవలె ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ ప్రధానంగా పోషించిన పాపులర్ పాత్రలలో ఒకటైనా దుర్యోధనుడి గెటప్‎లో వచ్చి బాలయ్య సందడి చేశారు. ఇందులో బాలకృష్ణ ఒక పవర్ ఫుల్ డైలాగ్‎ స్పీచ్‎తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ 64 గెటప్‎లలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానాన్ని బయోపిక్‎లో చూపించనున్నారు. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

- Advertisement -