ప్రభాస్‌ నాకు డార్లింగ్‌ కాదు…

276
Tamanna Bhatia Comments on Prabhas

చెన్నైలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌లో ‘బాహుబలి-2’ తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చిత్ర యూనిట్‌తో పాటు వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో సందడి చేశారు. ‘బాహుబలి-2’ తమిళ వెర్షన్ ఆడియో ఫంక్షన్‌లో తమన్నా మాట్లాడుతూ..ప్రభాస్‌కి చక్కటి కాంప్లిమెంట్ ఇచ్చింది.
 Tamanna Bhatia Comments on Prabhas
అందరికీ ప్రభాస్‌ డార్లింగ్ అయితే తనకు మాత్రం ‘డియర్  ఫ్రెండ్’ , ఎమేజింగ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా. అంతేకాకుండా ‘బాహుబలి’  సినిమా గురించి మరిన్ని విషయాల్ని బయటపెట్టింది. ‘బాహుబలి’ చిత్రంలో నటించడమే ఒక గొప్ప అవకాశమని అంది.

ఈ సినిమాలో నటించేటప్పుడు తాను అవార్డులు ఆశించలేదని, అసలు ఇలాంటి సినిమాలో నటించడమే ఒక అవార్డు అని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాకు కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ అందించారని, తాను నటించిన పాటకు ఆయన ఇచ్చిన ట్యూన్ తన జ్ఞాపకాల్లో పదిలంగా నిలిచిపోయిందని తమన్నా తన తన మనసులో మాటని చెప్పేసింది.