టాక్ ఆద్వర్యం లో ఘనంగా ఉగాది వేడుకలు

310
- Advertisement -

యూకే లోని షెఫీల్డ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్ ) మరియు హిందూ మందిర్ సంయుక్తంగా కలిసి శ్రీ హేవిళంబి నామ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు.

టాక్ సభ్యులు సాయిబాబు నర్రా మరియు అరవింద్ రెడ్డి అధ్యక్షతన షెఫీల్డ్ హిందూ దేవాలయంలోని కమ్యూనిటీ హాల్ లో జరిగిన వేడుకలకి ముఖ్య అతిథిగా లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ మరియు భారీగా ప్రవాస తెలుగు వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయ పూజలతో ప్రారంభించి పంచాగ శ్రవణం నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి, వేదికపై పిల్లలు చేసిన నృత్య కార్యక్రమానికి సభికులనుంచి విశేష స్పందన లభించింది.

Talk Ugadi celebrations are held in balance

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ మాట్లాడుతూ …. అందరికి నూతన శుభాకాంక్షలు తెలిపి తనకు హిందూ ధర్మం మరియు సాంప్రదాయాలు అంటే ఎంతో గౌరవం అనీ ఇంకా ముందు ముందు హిందూ ధర్మం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు .

టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ….ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపి ,రుచులలో తీపి, చేదు ఉన్నట్లే జీవితంలో కూడా కష్టసుఖాలు ఉంటాయని, వీటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవాలన్నదే ఉగాది పండుగ సందేశమని మరియు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింభింప చేయడమే టాక్ సంస్థ ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా అన్నారు.

టాక్ సభ్యులు అరవింద్ మాట్లాడుతూ…. ఈ ఉగాది సంబరాలలో తెలుగువారే కాకుండా మరాఠీలు , గుజరాతీలు ,బెంగాలీలు మరియు పంజాబీలు పాల్గొనడం విశేషం అని పేర్కొన్నారు, టాక్ ఆధ్వర్యం లో మున్ముందు ఇంకెన్నో కార్యక్రమాలని షెఫిల్డ్ లో నిర్వహిస్తామని సహకరించి అందరికి కృతఙ్ఞతలు తెలిపారు. తెలుగు వారి పండగలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న షెఫిల్డ్ హిందూ సమాజ్ సంస్థకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

Talk Ugadi celebrations are held in balance

టాక్ సభ్యులు సాయిబాబు నర్రా మాట్లాడుతూ….తెలుగు వారు ఎక్కడున్నా సంస్కృతి సంప్రదాయాలు ఆచరిస్తారనీ , అన్నిటిని మించి మనమందరము పండుగ రోజున ఒక చోటఉల్లాసంగా గడపడం ,దీనికి నిదర్శనం వందలాదిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వడమేనన్నారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

టాక్ ముఖ్య నాయకుడు రత్నాకర్ మాట్లాడుతూ, ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని, తెలంగాణ రాష్ట్రం లోని ప్రజలంతా సుఖశాంతులతో ఉండేలా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం లో రాష్ట్రం మరింత అభివృద్ధితో ముందుకు సాగాలని, కెసిఆర్ కి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

ఈ ఉగాది సంబరాలలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ,సభ్యులు సాయిబాబు నర్రా ,అరవింద్ రెడ్డి ,నవీన్ రెడ్డి ,రత్నాకర్ కడుదుల ,శ్రీకాంత్ జెల్లా , స్నేహలత , ప్రత్యుష ,మాధవ్,విజయ్ ,భూషణ్ ,రాజేష్ వాకా ,వెంకీ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -