నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్. కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల సమయంలో నే ప్రజలు గుర్తుకు వస్తారని దుయ్యబట్టారు. 2018 ఎన్నికల తర్వాత నేటి వరకు జానారెడ్డి నాగార్జున సాగర్ మొఖం చూడలేదని ఆరోపించిన తలసాని…. 14 సంవత్సరాలు మంత్రిగా ఉన్న జానారెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.
యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెల్లికల్లు లిఫ్ట్ ఏర్పాటు. ఆ కలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు తలసాని. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందుతుందని…..నాగార్జున సాగర్ డ్యాం పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు త్రాగు, సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదు…..నోముల భగత్ 40 వేల మెజారిటీతో గెలుస్తారని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ని అన్ని వర్గాల ప్రజల సుఖసంతోషాలతో ఉండాలి అనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.