1962 కాల్‌ సెంటర్‌ ఆపరేటర్ల సంఖ్య పెంపు

210
talasani srinivas yadav

జీవాలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. బుధవారం షామీర్ పేట మండలంలోని దేవరయాంజాల్లో గల జి.వి.కె కాల్ సెంటర్లు మంత్రి సందర్శించి నూతనంగా మంజూరైన 20 అదనపు ఆపరేటర్స్ సెంటర్ ను ప్రారంభించారు. కాల్ సెంటర్ కు వచ్చిన కాల్లో రైతులతో మంత్రి మాట్లాడి 1962 సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని జీవాల వద్దకే వైద్యం తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో 100 సంచార పశువైద్యశాలలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రైతులు 1962 నెంబర్ కు కాల్ చేస్తే వెంటనే సంచార పశువైద్యశాల వాహనం వచ్చి తగిన వైద్యం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో 1962 లో 10 మంది ఆపరేటర్ల ద్వారా సేవలను పొందే అవకాశం ఉండేదని, కానీ ఈ కాల్ సెంటర్ కు వచ్చే కాల్స్ సంఖ్య పెరిగిన కారణంగా సెంటర్ పై ఒత్తిడి పెరిగి తరచు లైన్ బిజీ వచ్చేదని ఆయన పేర్కొన్నారు.

talasani

పలువురు ప్రజాప్రతినిదులు, రైతుల నుండి వచ్చిన వినతుల మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదనంగా మరో 20 మంది ఆపరేటర్ల సేవలను మంజూరు చేయడం జరిగిందని వివరించారు. నేటి నుండి 80 మంది ఆపరేటర్ల ద్వారా సేవలను పొందవచ్చన్నారు. రోజుకు 4500 నుండి 5 వేల కాల్స్ ను స్వీకరించే అవకాశం ఏర్పడిందని మంత్రి శ్రీనివాసయాదవ్
వివరించారు. 1962 టోల్ ఫ్రీ నెంబర్ పనితీరు పర్యవేక్షించేందుకు గాను పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా అన్నీ పశువైద్యశాలలకు అనుసంధానం చేయబడుతుందని అన్నారు.

అంతేకాకుండా జీవాలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాను ప్రస్తుతం ఉన్న 100 వాహనాలకు అదనంగా మరో 100 వాహనాలను తీసుకునేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆమలు అవుతున్న కార్యక్రమాలను ఆనేక రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని వివరించారు. కాల్ సెంటర్ భవనం మొత్తం మంత్రి కలియతిరిగారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పశుసంవర్థకశాఖ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జీవికె సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, సిఈఓ సుబోద్ తదితరులు పాల్గొన్నారు.