సంగీత ప్రపంచంలో కిషన్‌ మహారాజ్ దృవతార..

61
- Advertisement -

భారతదేశ సంగీత ప్రఖ్యాత సంగీత విద్వాంసులకు భారతదేశం నెలవు. సంగీతంకు రాళ్లు సైతం కరిగిపోతాయి. అలాంటి సంగీత విద్వాంసుల్లో ఒకరు పండిట్. కిషన్ మహారాజ్. ఈయన్న ప్రముఖ తబలా విద్వాంసుడు పండిట్.హరీ మహారాజ్ కుమారుడు. ఈయన బనరాస్‌లో జన్మించారు. పండిట్ కిషన్ మహారాజ్‌ తన 11వ యేట నుంచే తబలా వాయిద్యాకారుడిగా సంగీత ప్రపంచంలోకి అరంగేట్రం చేశారు.

తన తండ్రి మరణాంతరం అంకులైన పండిట్‌. కాంతే మహారాజ్‌ దగ్గర శిష్యుడిగా చేరి గొప్ప తబలా వాయిద్యాకారుడిగా పేరు గడించారు. బనారస్ ఘరానా సృష్టికర్త అయిన రామ్ సహాయ్ దగ్గర శిష్యుడిగా సేవలు అందించారు. పండిట్. కిషన్ మహారాజ్ కుటుంబం మొత్తం సంగీత సరస్వతి పుత్రుల కుటుంబం. పండిట్ కిషన్ మహారాజ్ సంక్లిష్టమైన గణనలతో కూడిన క్రాస్ రిథమ్‌లను రూపొందించగలరు. అలాగే తిహై నమూనాలతో కూడిన తబలా ప్లేయర్‌లలో ఒకరిగా నిలిచారు.

Also Read: BirthDay:పంజాబీ సాహిత్యానికి వన్నె తెచ్చిన దలీప్‌ కౌర్

పండిట్ కిషన్ మహారాజ్‌ ఫైయాజ్ ఖాన్, ఓంకార్‌నాథ్ ఠాకూర్, బడే గులాం అలీఖాన్, బీమ్‌సేన్, జోషి రవిశంకర్, అలీ అక్బర్‌ఖాన్, వసంత్‌రాయ్, విలాయత్‌ ఖాన్, గిరిజా దేవి, సితార దేవి అనేక ప్రముఖలతో వేదికను పంచుకుని సంగీతంను శ్రోతలకు అందించారు. పండిట్ కిషన్ మహారాజ్ సితార్, సరోద్‌, ద్రుపద్‌, ఢమర్ వంటి ఏ విధమైన సంగీత వాయిద్యా పరికారాలతో నైనా సమానంగా వాయించడంలో అపారమైన బహుముఖ ప్రజ్ఞ ఉంది. సంగీత ప్రపంచంలో 50 సంవత్సారలకు సేవలకు గాను భారత ప్రభుత్వం రెండవ పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డుతో 2002లో సత్కరించి, బహుకరించింది.

Also Read: కర్ణాటక తొలి ముఖ్యమంత్రి.. కేసీ రెడ్డి

- Advertisement -