తాప్సీకి అక్కడ కూడా అదే రోల్‌…

199
- Advertisement -

తన అందం మరియు అభినయంతో తెలుగు వారిని ఆకట్టుకున్న ఢిల్లీ బ్యూటి తాప్సీ. తెలుగులో అగ్రహీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడికి ఇంతవరకు సరైన హిట్ లేదు. ఒకే ఒక్క ‘Mr. పర్ ఫెక్ట్’ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమిళ్,బాలీవుడ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్ లో సక్సెస్ కొట్టేసి మహా జోరు మీద ఉంది. ఇప్పుడు బాలీవుడ్‌లో తాప్సీ పన్ను బికినీ షాట్లతో రచ్చలేపేస్తున్నాయి. ఈ అమ్మడు ‘జుడ్వా2’ సినిమాలో తను బికినీల్లో కనిపించిన బిట్ వీడియోను తనే కట్ చేయించుకుని మరీ స్పెషల్ గా ప్రమోషన్ చేసుకుంటోంది. అసలు టూ పీస్ బికినీల్లో ఈమె అందాలను చూడగానే బాలీవుడ్‌ జనాలు ఫిదా అయిపోయారట.

Taapsee Pannu Hot Bikini Looks In Judwaa 2

దక్షిణాదిలో కేవలం నా అందాలను గ్లామర్ ను వాడుకున్నారే తప్పించి అసలు ఏమాత్రం నా యాక్టింగ్ టాలెంట్ గుర్తించలేదు అంటూ తాప్సీ చాలాసార్లు కామెంట్ చేసింది. అలాగే పింక్ .. నామ్ షబానా వచ్చాక నాకు యాక్టింగ్ వచ్చిందని వారు గుర్తించారంటూ చెప్పేసింది. కాని కట్ చేస్తే ఇప్పుడు జుడ్వా 2 సినిమాలో తాప్సీని కేవలం టూ పీసుల్లో నడవడానికి.. బీచుల్లో తడవడానికి.. పెదాల ముద్దులు జుర్రుకోవడానికి మాత్రమే వాడుకున్నారు. ట్రైలర్ చూస్తే ఆమెకు సినిమాలో అంతకంటే రోల్ ఏమీ లేదని అర్దమవుతూనే ఉంది. అసలు బాలీవుడ్ లో కూడా తెలుగులో చేసినట్లే కమర్షియల్ హీరోయిన్ గా చేయాలని ప్రయత్నించి ఇన్నాళ్ళకు సక్సెస్ అయ్యింది తాప్సీ. కాని ఈ మధ్యలో మాత్రం యాక్టింగ్ అదీ ఇదీ అంటూ నోరుపాడేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో అమ్మడు బికినీ సోయగాలను చూసి.. ఇంకా సౌత్ వాళ్ళు ఏమన్నా గుర్తించాలా?

శ్రీదేవి నుండి ఇలియానా వరకు.. తాప్సీ నుండి రాధికా ఆప్టే వరకు.. తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్డమ్ తెచ్చుకుని.. ఇటు నుండి బాలీవుడ్ వెళ్లగానే తెలుగోళ్లకు కేవలం గ్లామర్ మాత్రమే కావాలి అంటూ కామెంట్లు చేసేశారు. కాని వారు అక్కడకు వెళ్ళాక ఇక్కడి చేసిన తరహా సినిమాలే కాని ఆస్కార్ అవార్డు వచ్చే సినిమాలేవీ చేయలేదు. కాని టాలీవుడ్ మీద కామెడీ చేస్తుంటారు. అది సంగతి.

- Advertisement -