- Advertisement -
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత గృహహింస కేసులు పెరిగి పోయాయని వెల్లడించారు అదనపు డీజీ స్వాతి లక్రా.
13 రోజుల్లో డయల్ 100కు ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపిన ఆమె… గృహహింసకు గురవుతున్నావారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. లాక్‌డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే ఉంటున్నారని ఈ నేపథ్యంలో గృహహింసలు జరుగుతున్నాయని, అలాంటి వాటిపై తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇక లాక్ డౌన్ వేళ సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయని… ఇలాంటి సమయంలో మహిళలు బయటకు రాకుండా వెంటనే 100కు ఫోన్ చేయవచ్చునని, లేదా షీ టీమ్స్ కూడా తెలియజేయచేస్తు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.
- Advertisement -