గ్రేటర్‌లో జోరుగా మాస్ వ్యాక్సినేషన్..

31
ghmc

కరోనా కట్టడిలో భాగంగా సూపర్ స్ప్రైడర్స్‌కి టీకాలు వేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఉదయం 8 గంటల నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా ఇందుకోసం 32 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్‌లో వెయ్యి మందికి టీకాలు వేస్తుండగా 10 రోజుల్లో గ్రేటర్ పరిధిలో 3 లక్షల మందికి టీకాలు వేయనున్నారు.

వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేకంగా టోకెన్లను పంపిణీ చేసింది. ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో 10 మంది ఏఎన్ఎంలు, 10 మంది డాటా ఆపరేటర్లు, ఇద్దరు డాక్టర్లుతో పాటు సలహాలు సూచనలు కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 10 డిఫరెంట్ కలర్స్‌తో కూడిన టోకెన్లు పంపిణీ చేశారు.