బాల్క సురేశ్ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

24
cm kcr

చెన్నూరు నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బాల్క సుమన్ కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి బాల్క సురేశ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ బాల్క సుమన్ పరామర్శించారు.

బాల్క సురేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సురేశ్, టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్రపోషించారని సిఎం గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుమన్‌ను, సిఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.