సుస్మిత సేన్…మాజీ మిస్ ఇండియా. అందరకీ సోలో ఉమెన్‌గా, మాజీ మిస్ ఇండియాగా సుపరిచితమైన ఈ అమ్మడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమాలు వదిలేసి ఫ్యాషన్ ప్రపంచంలో తన హవా చూపిస్తుంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం ముంబై కేంద్రంగా మోడల్స్‌కి ట్రైనింగ్ ఇస్తూ శభాష్ అనిపించుకుంటోంది కూడా. అంతేకాకుండా ఇటీవలే తెలంగాణకు చెందిన ఓ తెలుగమ్మాయిని ఫ్యాషన్ ఐకాన్‌గా తీర్చిదిద్ది ప్రపంచానికి పరిచయం చేసింది.
అయితే సుస్మిత చేసిన ఓ పని వల్ల సోషల్ మీడియా మొత్తం ఆ విషయం గురించే చర్చిస్తోంది. అసలు సుస్మిత చేసిన ఆ పని ఏంటి అనుకుంటున్నారా? ఈ బ్యూటీ పిల్లల్ని దత్తత తీసుకుని మమ్మీ అయ్యిందన్న మ్యాటర్ అందరికీ తెలిసిందే. అయితే.. ఆరేళ్ల తన చిన్నపాప అలీసా తో కలిసి స్విమ్ షూట్లో డ్యాన్స్ చేసింది సుస్మిత.
స్విమ్మింగ్ పూల్ చెంత డ్యాన్సాడుతున్న ఆ ఫోటోల్ని సోషల్ మీడియలో అభిమానులకు షేర్ చేసింది సుస్మిత. ఇంకేముందీ…ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ఓ రేంజులో వైరల్ మారాయి. ఇప్పుడు అందరూ ఈ ఫోటోల గురించి చర్చించుకోవడం విశేషం. ఏదేమైనా..మనసుండాలే కానీ.. వయసు దేనికీ అడ్డంకి కాదు అని నిరూపించింది ఈ బ్యూటీ.
ఆరేళ్ళ పాపతో బికినీ డాన్స్..
- Advertisement -
- Advertisement -