‘మెంటల్ మది’లో ఉగాది స్పెషల్…

168
Mental Madhilo Ugadi special

శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్‌ జంటగా వివేక్‌ ఆత్రేయ దర్శకుడిగా ధర్మపథ క్రియేషన్స్‌ పతాకంపై రాజ్‌కందుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘మెంటల్‌ మదిలో’. పెళ్ళిచూపులు వంటి ట్రెండ్ సెట్టర్ చిత్రం తర్వాత రాజ్ కందుకూరి నిర్మాతగా వివేక్ ఆత్రేయను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉగాది సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సినిమాను జూలైలో విడుదల చేస్తున్నామని సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని తెలిపారు.

Mental Madhilo Ugadi special

వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం : ప్రశాంత్‌ విహారి, కెమెరా: వేదా రామన్‌, ఎడిటింగ్‌: విప్లవ్‌.

ఈ మధ్యే విడుదలై సంచలనం క్రియేట్ చేసిన మల్టీ స్టారర్ అప్పట్లో ఒకడుండేవాడు. ఈ చిత్రంలో నారా రోహిత్ తో పాటు శ్రీ విష్ణు కీలక పాత్ర పోషించాడు. ఇందులో విష్ణు నటనకు మంచి మార్కులే పడ్డాయి.  ప్రేమ ఇష్క్ కాదల్, నల దమయంతి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్యయమ్మురా వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. తాజాగా మెంటల్ మదిలో అంటూ సోలోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.