ఈ మగాళ్లకి వర్జినిటీ అవసరం లేదు…

141
Piya bajpai says about Virginity

టాలీవుడ్,కోలీవుడ్,మాలీవుడ్..ఏంటో ఈ మధ్యన పాపులర్ అవ్వడానికి హీరోయిన్లు ఇప్పుడు వారంతా ఒకటే రూటు పట్టుకుంటున్నారు. సౌత్ లో హీరోలు మగపెత్తనం చూపిస్తున్నారంటూ రాధికా ఆప్టే చెబితే.. సెక్స్ కోర్కెలు తీర్చమన్నాడు ఓ డైరక్టర్ అంటూ లేఖ వాషింగ్టన్ కామెంట్ చేసింది. వేధించారని హీరోయిన్ వేద చెబితే.. అసభ్యంగా ప్రవర్తించారని మాధవిలత చెప్పింది. ఇలా అందరూ సెక్స్ రిలేటెడ్ కామెంట్లే ఎక్కువగా చేస్తున్నారు.

Piya bajpai says about Virginity

అంతగా పాపులర్ కాని హీరోయిన్ రంగం ఫేం పియా బాజ్పాయ్. ఇప్పుడు ఇదే బాటలో వెళ్ళకపోయినా కూడా.. జనరల్ గా ఇప్పుడు జరుగుతున్న యవ్వారంపై మాట్లాడుతున్నానంటూ.. ”ఇప్పటి తరం కుర్రాళ్ళు నాకు వర్జిన్ (కన్య) కావాలని కోరుకోవట్లేదు. ఇంకా ఎవరైనా అలా అడుగుతున్నారంటే.. ఖచ్చితంగా అది పెద్దల ప్రభావం వలనే. అందుకే మనకు కన్నెపొరను తిరిగి రూపొందించే సర్జరీలు చిన్న చిన్న టౌన్లలో ఇంకా చేయించుకుంటున్నారు. కాని సిటీలో మాత్రం అలాంటివేం లేవు” అంటూ కామెంట్ చేసింది పియా.

ఈమె నటించిన ‘మీర్జా జూలియట్’ సినిమా వచ్చే వారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆల్రెడీ బికినీ షూట్లతో అల్లల్లాడిస్తున్న పియా.. ఇప్పుడు ఈ వర్జినిటీ కామెంట్లతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.