భార్య బొట్టు, తాళి తీయించిన పాక్.. నిప్పులు చెరిగిన సుష్మా..

232
Sushma Swaraj's Statement On Kulbhushan Jadhav's
- Advertisement -

‘భర్త బతికుండగానే నుదుటన కుంకుమ, తాళిబొట్టును, చేతి గాజులను ఏ భారత మహిళా తీయబోదు ఈ భారతీయ సాంప్రదాయం పాక్‌ అధికారులకు తెలియదా’..? అంటూ ఈ ఉదయం రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు.

Sushma Swaraj's Statement On Kulbhushan Jadhav's

పాకిస్థాన్ లో గూఢచారిగా, భారత ఉగ్రవాదిగా ముద్రపడి, ఉరిశిక్షకు గురై, 21 నెలలుగా జైల్లో ఉన్న కులభూషణ్ జాదవ్ ను ఆయన భార్య, తల్లి ఇస్లామాబాద్ లో కలసిన వేళ, పాక్ అధికారులు చేసిన అవమానంపై మండిపడింది సుష్మా. భారత సంస్కృతి, సంప్రదాయాలను పాకిస్థాన్ ఏ మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టిన ఆమె, ఓ ముత్తయిదువును వితంతువుగా మారుస్తారా? అని ప్రశ్నించారు.

 ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రకటన చేసిన సుష్మా…జాదవ్ భార్య కట్టుకున్న చీరను బలవంతంగా విప్పించి, కుర్తా కట్టించడం కూడా అవమానించినట్టేనని అన్నారు. ఈ అవమానం జాదవ్ భార్యకు మాత్రమే కాదని, యావత్ భారత మహిళలకు జరిగిన అవమానమని నిప్పులు చెరిగారు. కనీసం వారిని తమ మాతృభాషలో కూడా మాట్లాడనివ్వలేదని విమర్శించారు.

 Sushma Swaraj's Statement On Kulbhushan Jadhav's

పాకిస్థాన్ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని ఇప్పటికే తాను ఆ దేశ దౌత్యాధికారుల దృష్టికి తీసుకు వెళ్లానని అన్నారు సుష్మా స్వరాజ్.

కాగా .. సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ స్పందిస్తూ.. ‘జాదవ్‌ భార్య, తల్లిని పాక్‌ అవమానించడం అంటే మొత్తం భారతీయులనే అవమానించినట్లు. రాజకీయ విభేదాలు లేకుండా దీనిపై అందరం పోరాడాలి. మన తల్లులు, సోదరీమణుల పట్ల వేరే దేశం చెడుగా ప్రవర్తిస్తే దాన్ని చూస్తూ సహించకూడదు’ అని అన్నారు.

- Advertisement -