తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలోని అంతర్గత విభేదాల నేపథ్యంలో పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తు అయిన “పువ్వులు – గడ్డి” (Flowers & Grass) ని ఫ్రీజ్ (స్తంభింపజేస్తూ) చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీలో మమతా బెనర్జీ మరియు అరుప్ రాయ్ వర్గాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ 18న తృణమూల్ కాంగ్రెస్ పేరు, గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేసింది. వివాదం పూర్తిగా తేలేవరకు రెండు వర్గాలు కొత్త పేర్లు, గుర్తులను ఉపయోగించాలని సూచించింది.
మధ్యంతర గుర్తులు: రాబోయే ఉపఎన్నికల కోసం మమతా బెనర్జీ వర్గానికి ‘ఫుట్బాల్ క్రీడాకారుడు’ (Footballer) గుర్తును, తిరుగుబాటు వర్గానికి ‘ఉత్తరం కవరు’ (Envelope) గుర్తును కేటాయించారు.
మమతా బెనర్జీ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదిస్తూ — ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మధ్యలో గుర్తును ఫ్రీజ్ చేయడం అసాధారణమైన చర్య అని, గత కొన్ని నెలలుగా ప్రక్రియ పెండింగ్లో ఉన్నప్పటికీ సమయానికి ముందే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.రెండు వర్గాల వాదనలను సమగ్రంగా వినాల్సి ఉందని సీజేఐ బెంచ్ పేర్కొంటూ ఈ అంశంపై త్వరితగతిన విచారణ జరుపుతామని వెల్లడించింది.
Also Read:ఆ బ్యాంకులు ఆదివారం ఓపెన్!

