- Advertisement -
ఆర్య సమాజ్‌లో జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రానికి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్య సమాజ్ కు వివాహ ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు హక్కు లేదు.ఆర్య సమాజ్ పెళ్లిళ్ల సర్టిఫికెట్లను గుర్తించబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.సమర్థవంతమైన అధికారులు మాత్రమే పెళ్లి సర్టిఫికెట్లను జారీ చేయగలరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఒరిజినల్ సర్టిఫికెట్‌ను కోర్టు ముందుంచాలని ధర్మాసనం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో పిటిషన్ ను విచారించింది.
- Advertisement -