50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని ప్రతిపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సర్వొన్నత న్యాయస్ధానం సుప్రీం తోసిపుచ్చింది. కేవలం ఒక నిమిషంలోనే వాదనలు ముగించిన న్యాయస్ధానం ఈ అంశంలో మేమిచ్చిన తీర్పును సవరించేందుకు ఆసక్తిగా లేమని స్పష్టం చేసింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా లెక్కించే వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యను పెంచాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని అయిదు వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని ఎన్నికల కమిషన్‌ను ఏప్రిల్ 8న ఆదేశించింది.
అయితే ఈ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.అయితే దీనిని త్రోసిపుచ్చింది సుప్రీం.