భానుడి ఉగ్రరూపం…16 మంది మృతి

283
heatwave
- Advertisement -

ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో 16 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పగటిపూట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో కూడా వడగాలులు వీచే అవకాశాలుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోమవారం వడదెబ్బకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరిలో నలుగురు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే 10 నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.

ఏపీలోని కృష్ణా జిల్లా దొనబండలో అత్యధికంగా 46.8 డిగ్రీలు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా బాణాపురం, పమ్మిలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతకు లక్షల కోళ్లు మరణించాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు.

- Advertisement -