భారతదేశంలోని ప్రజాప్రతినిధులందరికి భావ ప్రకటనా స్వేచ్ఛలో పరిధుఉలేమీ ఉండవని…సామాన్య ప్రజలకు ఎటువంటీ హక్కులు ఉంటాయో ప్రతినిధులకు కూడా అటువంటి హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది.
2016నాటి కేసును ఉటంకిస్తూ ప్రతినిధులు తమ పరిధిమేరకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని తెల్చి చెప్పింది. అయితే వారు ప్రజాజీవితంలో ఉన్న వారు వారికి వారుగా కొన్ని పరిమితులు ఏర్పరచుకోవాలని సూచించింది. అయితే రాజ్యంగం మాత్రం వారి వాక్ స్వాతంత్య్రం హక్కుపై అదనపు ఆంక్షలను విధించడం సాధ్యం కాదని పేర్కొంది.
2016లో జరిగిన సామూహిక అత్యాచారానికి గురైన సంఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందని అజాం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టగా వాక్ స్వాతంత్య్రం హక్కు భారత పౌరలందరికీ సమానమేనని స్పష్టం చేసింది.
భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ప్రజాప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు అనేవి ఆర్టిల్ 19(2)ప్రకారం అతీతంగా ఉండకూడదని తెలిపింది. ప్రాథమిక హక్కులు అనేవి ప్రజలందరికీ సమానమని ప్రజాప్రతినిధులపై ఆంక్షలు విధించడం సరికాదని తెలిపింది.
ఇవి కూడా చదవండి…
సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనిది..
సభలపై జగన్ కీలక నిర్ణయం….
సునీల్ కనుగోలు పిటిషన్..హైకోర్టు కీలక తీర్పు