జ‌న‌వ‌రి 6న ‘పేట’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

243
Peta movie
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా న‌టిస్తున్న చిత్రం పేట‌. కార్తీక్ సుబ్బ‌రాజు ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ కు జోడిగా త్రిష న‌టించిగా.. నవాజుద్దీన్ సిద్ధిక్, విజయ్ సేతుపతి, శశికుమార్, త్రిష, సిమ్రన్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈచిత్రంపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.ఉన్నాయి. జ‌న‌వ‌రి 10న ఈసినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈచిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌ను ఈనెల 6న హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు చిత్ర‌బృందం.

super star peta

హైద‌రాబాద్ లోని జేఆర్సీ క‌న్వేన్ష‌న్ సెంట‌ర్ లో జ‌రిగే ఈకార్య‌క్ర‌మానికి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా హాజ‌రుకానున్నారు. తాజాగా విడుద‌ల చేసిన ఈమూవీ ట్రైల‌ర్ కు మంచి రెస్పాస్ వ‌స్తుంది. చిత్రంలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుథ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిచారు. ఈమూవీని తెలుగులో అశోక్ వ‌ల్ల‌భ‌నేని విడుద‌ల చేస్తున్నారు.

- Advertisement -