ర‌జ‌నీకాంత్ ‘పేట’ తెలుగు ట్రైల‌ర్ విడుద‌ల (వీడియో)

304
peta
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా న‌టిస్తున్న చిత్రం పేట‌. కార్తీక్ సుబ్బ‌రాజు ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ కు జోడిగా త్రిష న‌టించిగా.. నవాజుద్దీన్ సిద్ధిక్, విజయ్ సేతుపతి, శశికుమార్, త్రిష, సిమ్రన్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈచిత్రంపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.ఉన్నాయి. జ‌న‌వ‌రి 10న ఈసినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ త‌మిళ వ‌ర్షెన్‌లో విడుద‌ల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది కొద్ది సేప‌టి క్రితం ఈసినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్.

peta movie

ఈ ట్రైలర్ చూస్తే రజినీ స్టైలిష్ మేనరిజం ను ఈ చిత్రంలో పూర్తిగా చూపించబోతున్నారని తెలుస్తుంది. చిత్రంలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుథ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిచారు. ఈమూవీని తెలుగులో అశోక్ వ‌ల్ల‌భ‌నేని విడుద‌ల చేస్తున్నారు.

- Advertisement -