మ‌న సినిమా కోసం వెయిటింగ్ సార్ః మ‌హేశ్ బాబు

144
sukumar Mahesh babu

నాన్న‌కు ప్రేమ‌తో, రంగ‌స్ధ‌లం వంటి హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న త‌ర్వాతి సినిమా ఎవ‌రితో చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పుకార్ల‌కు పుల్ స్టాప్ పెట్టారు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు. ఇవాళ సుకుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్షాలు చెప్పాడు మ‌హేశ్ బాబు. అలాగే మ‌న స‌నిమా ఎప్పుడూ ప్రారంభంమ‌వుతుందా అని ఎదురుచూస్తున్నాను సార్ అని కామెంట్ పెట్టాడు మ‌హేశ్.

Mahesh_Babu

దీంతో మ‌హేశ్ త‌ర్వాతి సినిమా సుకుమార్ తో అని క్లారీటి వ‌చ్చేసింది. దేవి శ్రీప్ర‌సాద్ ఈచిత్రానికి సంగీతం అందించ‌గా..మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్ధ వారు ఈసినిమాను నిర్మించ‌నున్నారు. మ‌హేష్-సుకుమార్ కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ 1 నేనొక్క‌డినే అంత‌గా అలరించ‌క‌పోగా, త్వ‌ర‌లో రానున్న చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొడుతుంద‌ని భావిస్తున్నారు అభిమానులు.

ప్ర‌స్తుతం మ‌హేశ్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షీ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈమూవీ ఎప్రిల్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఫిబ్ర‌వ‌రిలో నుంచి మ‌హేశ్ 26వ సినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభ‌కానుంద‌ని స‌మాచారం.