సూపర్ స్టార్ ఆవిష్కరించిన.. “చెరగని జ్ఞాపకం”

296
Super Star Krishna unveiled "Cheragani Gnapakam"
- Advertisement -

తెలుగు సినిమాల్లో మరుపురాని సంభాషణలు , పాటలతో చిరంజీవిగా  నిలిచిపోయిన సుప్రసిద్ధ సినీ రచ్చయిత  కీ . శే. మోదుకూరి జాన్సన్ జీవిత విశేషాలతో రూపొందించిన “చెరగని జ్ఞాపకం” పుస్తకాన్ని పద్మాలయ స్టూడియో కార్యాలయంలో సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు . తెనాలి కి చెందిన న్యాయవాది ,జర్నలిస్ట్,గుంటూరు కృష్ణ దీనిని  రచించగా ,ఈ సందర్భం గా తక్కువ సమయంలో సినీ రచయితగా ఎంతో గుర్తింపు పొందారని ,మా పద్మాలయ ‘పాడి పంటలు’  చిత్రం లో ‘మన జన్మ భూమి బంగారు భూమి ‘ గీతం రచించి అసాధారణమైన ఆదరణ పొందిన విషయం తెలిసినదే.. మాకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకుని రచయితను అభినందించారు .

Untitled-1 copy

1974 లో అక్కినేని హీరో గా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ‘మరో ప్రపంచం’ చిత్రం ద్వారా పరిచయమై ,50 సినిమాలకు రచన చేయగా,ఎన్ .టి.ఆర్ డబ్బుకు లోకం దాసోహం,దేశోద్ధారకులు , ధనమా ! దైవమా!, శోభన బాబు డాక్టర్ బాబు,దేవాలయం ,మానవుడు దానవుడు, విజయచందర్’కరుణామయుడు ‘ చిత్రం లో’ కదిలింది కరుణ రధం ‘ గీతం రచించారు . సూపర్ స్టార్ కృష్ణ తో నేరము శిక్ష;మూడు పువ్వులు-ఆరు కాయలు ; బంగారు భూమి,పగబట్టిన సింహం ;పాడిపంటలు చిత్రాలు కాగా; ఆదుర్తి  పి.చంద్రశేఖర్ రెడ్డి,టి. కృష్ణ, బాపయ్య , విజయ నిర్మల, విజయ చన్న్డర్,తదితర దర్శకులు, పద్మాలయ, సురేష్ ప్రొడక్షన్స్,ఉషశ్రీ వంటి సంస్థలు నిర్మాణం లో కధ  మాటలు  అందించి సినీ పరిశ్రమకు విజయవంతమైన చిత్రాలు అందించారు .

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత జి. ఆది శేషగిరి రావు ,శాఖమూరి మల్లికార్జున్ రావు ,సీనియర్ అభిమాని, వ్యాపార వేత్త కేంద్ర సెన్సార్  బోర్డు  మెంబెర్ జె.పి . ఉసేనయ్య తదితరాలు పాల్గొన్నారు. ఈ సందర్భం గా రచయిత గుంటూరు కృష్ణ మాట్లాడుతూ… మహాను భావుడు మోదుకూరి జాన్సన్ పుస్తకం రచించే అవకాశం అదృష్టం గా భావిస్తున్నానని , ఆవిష్కరణ చేసిన సూపర్ స్టార్ కృష్ణకు  తెలిపారు.

- Advertisement -