ఐపీఎల్ పదో సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 76(నాటౌట్), హెన్రిక్వెస్ 52(నాటౌట్)తో 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో 15.3 ఓవర్లకే 140 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచింది.
స్కోర్ వివరాలు..
గుజరాత్ లయన్స్ : జాసన్ రాయ్ 31(భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్), బ్రాండన్ మెక్‌కల్లమ్(ఎల్బీడబ్ల్యూ రషీద్ ఖాన్), సురేశ్ రైన(ఎల్బీడబ్ల్యూ రషీద్ ఖాన్), ఆరోన్ ఫించ్(ఎల్బీడబ్ల్యూ రషీద్ ఖాన్), దినేష్ కార్తీక్ 30(నెహ్రా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్), డ్వెయిన్ స్మిత్ 37(భువనేశ్వర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్), ధావల్ కులకర్ణి(రషీద్ ఖాన్ చేతిలో రనౌట్), ప్రవీణ్ కుమార్ 7(నాటౌట్), మసిల్ తంపి 13(నాటౌట్).. మొత్తం : 20 ఓవర్లకు 135/7.
సన్‌రైజర్స్ హైదరాబాద్: శిఖర్ ధావన్ 9(ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్), డేవిడ్ వార్నర్ 76(నాటౌట్), హెన్రిక్వెస్ 52(నాటౌట్). మొత్తం : 140/1(15.3 ఓవర్లలో)