ప్లే ఆఫ్‌లోకి సన్‌రైజర్స్‌‌ హైదరాబాద్..

231
Sunrisers Hyderabad beat Delhi Daredevils
- Advertisement -

ఢిల్లీని ఓడించిన హైదరాబాద్‌. వరుసగా ఆరో విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సగర్వంగా ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టింది. శిఖర్‌ ధవన్‌ (50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 నాటౌట్‌), కేన్‌ విలియమ్సన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 83 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొట్టడంతో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్‌ పోటీ నుంచి తప్పుకుంది. అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 128 నాటౌట్‌) అద్భుత శతకంతో రాణించాడు. షకీబల్‌కు 2 వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 191 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు ధవన్‌, విలియమ్సన్‌ మధ్య అజేయంగా 176 రన్స్‌ నమోదయ్యాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ శిఖర్‌ ధవన్‌కు దక్కింది.

Sunrisers Hyderabad beat Delhi Daredevils

దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) ధావన్‌ (బి) షకిబ్‌ 9; జేసన్‌ రాయ్‌ (సి) గోస్వామి (బి) షకిబ్‌ 11; శ్రేయస్‌ రనౌట్‌ 3; రిషబ్‌ పంత్‌ నాటౌట్‌ 128; హర్షల్‌ రనౌట్‌ 24; మాక్స్‌వెల్‌ (సి) హేల్స్‌ (బి) భువనేశ్వర్‌ 9; విజయ్‌ శంకర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 187; వికెట్ల పతనం: 1-21, 2-21, 3-43, 4-98, 5-161; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-51-1; సందీప్‌ 4-0-24-0; షకిబ్‌ 4-0-27-2; సిద్ధార్థ్‌ కౌల్‌ 4-0-48-0; రషీద్‌ 4-0-35-0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హేల్స్‌ (ఎల్బీడబ్ల్యూ) హర్షల్‌ పటేల్‌ 14; ధావన్‌ 92 నాటౌట్‌; విలియమ్సన్‌ 83 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (18.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 191; వికెట్ల పతనం: 1-15; బౌలింగ్‌: ట్రెంట్‌ బౌల్ట్‌ 3.5-0-43-0; పటేల్‌ 4-0-32-1; నదీమ్‌ 2-0-22-0; ప్లంకెట్‌ 4-0-41-0; అమిత్‌ మిశ్రా 3-0-29-0; శంకర్‌ 1-0-14-0; మాక్స్‌వెల్‌ 1-0-9-0.

- Advertisement -