శృంగార తార సన్నీలియోన్ వీరనారిగా కత్తి తిప్పేందుకు ‘వీర మహాదేవి’ రెడీ అవుతోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్నీలియోన్ మెయిన్ రోల్ లో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెలుగు, తమిళ, మలయాళం,హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా వీరమహాదేవి.
వి.సి.వడివుడయన్ డైరెక్షన్ లో ఫిబ్రవరి 7న వీర మహాదేవి షూటింగ్ మొదలైంది. సన్నీపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నరు. ఇటుకలని ఒంటి చేత్తో పగలగొడుతున్న ఫోటోని గురువారం సన్నీ ట్వీట్ చేస్తూ… నేను కొడితే అన్ని ఇటుకులు దెబ్బకు నుజ్జునుజ్జు కావాల్సిందే అంటూ కామెంట్ చేసింది.
ఇప్పటికే ఈ సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంది సన్నీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్లను ఇచ్చింది. తెలుగులో ‘వీరమహాదేవి’ పేరుతో ఈ సినిమా రానుంది. ఫస్ట్ టైం సన్నీలియోన్ రొమాంటిక్ చిత్రాలకు భిన్నంగా నటిస్తుండటంతో.. సినీ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది చర్చ అయ్యింది.
I swear all the bricks crumbled to the ground after I hit them!!#SunnyLeone #DhaiKiloKaHath
pic.twitter.com/7NDBIpCbRT
— Sunny Leone (@SunnyLeone) February 8, 2018