కేజీఎఫ్‌ 2….అధీరా బర్త్ డే గిఫ్ట్

122
Sanjay Dutt
- Advertisement -

భారతదేశంలో హైప్ ఎక్కువగా ఉన్న చిత్రాల్లో ఒకటి కేజీఎఫ్‌. యశ్‌, శ్రీనిధి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్‌ చాప్టర్ 2 వస్తుండగా బాలీవుడు నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ కీరోల్ పోషిస్తున్నారు.

సంజయ్‌ అధీరాగా విలన్ రోల్ పోషిస్తుండగా బర్త్ డే సందర్భంగా లుక్‌ని విడుదల చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యుద్ధం పురోగతి కోసం ఉద్దేశించబడింది. రాబందులు కూడా నాతో అంగీకరిస్తాయి – అధీరా, హ్యాపీ బర్త్ డే సంజయ్ దత్” అంటూ ఈ పోస్టర్ పై రాసుకొచ్చారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా మాళవిక అవినాష్, ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, రావు రమేష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తర్వాత సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -