Devara:’దేవర’ లోకి బాలీవుడ్ స్టార్

14
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 షూటింగ్ తిరిగి రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చే వారం నుంచి స్టార్ట్ కానుంది. కాబట్టి, ఇక ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరిస్తారట. రోజూ ఒకటి రెండు యూనిట్స్ దేవర చిత్రీకరణలో పాల్గొన బోతున్నట్లుగా సమాచారం. అక్టోబర్ టార్గెట్ గా ‘దేవర’ యూనిట్ కష్టపడుతుంది. జాన్వీ కపూర్ కూడా అటు హిందీ మూవీస్ ఇటు ‘దేవర పార్ట్ 1’ షూటింగ్స్ తో బిజీ బిజీగా కనబడుతుంది.

నార్త్ లో దేవర అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అంచనాలు ఉండటంతో ‘దేవర పార్ట్ 1’ లోకి కొంతమంది బాలీవుడ్ నటులని కొరటాల శివ తీసుకుంటున్నారు. ఐతే, సైఫ్ అలీఖాన్ కాకుండా మిగిలిన పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయమై ఇంతవరకు క్లారిటీ లేదు. తాజాగా బాలీవుడ్ నటుడు, ప్యాన్ ఇండియా యాక్టర్ సంజయ్ దత్ ‘దేవర పార్ట్ 1’ లో భాగం కాబోతున్నాడనే న్యూస్ వినిపిస్తోంది. ‘సంజయ్ దత్’ కోసం ‘దేవర పార్ట్ 2’ లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేశారని.. ఈ చిత్రంలో సంజయ్ దత్ డాన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.

సోషల్ మీడియా టాక్ ప్రకారం.. ఇంతకుముందు కూడా చాలా స్టార్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, ఏ పుకారు పై దేవర టీమ్ అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు సంజయ్ దత్ కేరెక్టర్ పై కూడా చిత్రబృందం ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. మరి సంజయ్ దత్ ఈ సినిమాలో నటిస్తున్నాడా ? లేదా ? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

Also Read:IPL 2024:ఓపెనర్‌గా ధోని.. పూనకాలే?

- Advertisement -