విరాట్ అలా చేస్తే సాధిస్తాడు…సన్నీ

29
- Advertisement -

క్రికెట్‌ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్‌ సాధించిన రికార్డులను తిరగరాసే సత్తా విరాట్‌కోహ్లీకి ఉందని పలువురు ప్రముఖ క్రికెట్‌ విశ్లేషుకుల అంచనా. అయితే తాజాగా మరోసారి సునీల్ గవాస్కర్‌ కోహ్లీని మెచ్చుకున్నారు. శతక శతకాలను సాధించాడానికి విరాట్‌కు ఎంతో దూరంలో లేదన్నారు. అంతే కాదు తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని సూచించారు. మరో ఐదారేళ్లు ఆడితే వంద సెంచరీలు పూర్తి చేస్తారని జోస్యం చెప్పారు.

ఈ ఐదారేళ్లలో 26సెంచరీలు చేస్తే వంద సెంచరీల క్లబ్‌లో సచిన్‌తో చేరిపోతారని అన్నారు. ప్రస్తుతం విరాట్ వయస్సు 34యేళ్లు…40 యేళ్ల వరకు క్రికెట్‌ను ఆస్వాదిస్తే ఖచ్చితంగా రికార్డు సృష్టిస్తాడు. ఈసందర్భంగా సచిన్‌ కూడా 40యేళ్ల పాటు క్రికెట్‌ ఆడిన విషయంను గుర్తు చేశారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన సచిన్‌(49) రికార్డును ఈ యేడాదిలో పూర్తిచేస్తారని అన్నారు.

శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మూడవ వన్డే పోరులో విరాట్ లంకపై విరుచుకుపడ్డారు. దీంతో విరాట్(166) వన్డేలో 46వ శతకం సాధించారు.  స్వదేశంలో అత్యధిక సెంచరీలు (21)చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో ఎక్కువ ర‌న్స్ కొట్టిన ఐదో ఆట‌గాడిగా.. శ్రీ‌లంక‌పై ప‌ది సార్లు వందకు పైగా ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి…

లంకను చిత్తుచేసిన భారత్..సిరీస్ క్లీన్ స్వీప్

విరాట్ సెంచరీ..భారత్ గెలుపు

సచిన్‌ రికార్డు వేటలో కొహ్లీ…

- Advertisement -