మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి రీసెంట్ టైమ్‌లో నిర్మించబోయే భారీ చిత్రాలకు సంబంధించి అనౌన్స్‌మెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ‘మైఖేల్’ అనే భారీ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. మరో నిర్మాణ కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పితో కలిసి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ రోల్‌ను చేస్తున్నారు.
కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాలను చేసే హీరో సందీప్ కిషన్, దక్షిణాదిన విలక్షణమైన పాత్రలను చేసే యాక్టర్ విజయ్ సేతుపతి కలిసి ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇద్దరు వెర్సటైల్ యాక్టర్స్‌ను స్క్రీన్‌పై చూడటం ప్రేక్షకులకు కన్నుల పండుగైన విషయమే. అలాగే ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ‘మైఖేల్’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే సినిమాలో మైఖేల్ అనే పవర్‌ఫుల్ పాత్రలో సందీప్ కిషన్ నటించబోతున్నారని అర్థమవుతుంది. అలాగే సందీప్ ఇందులో ఓ అద్భుతమైన, ఇన్‌టెన్స్ ఉన్న పాత్రలో సందీప్‌కిషన్ నటింబోతున్నారని పోస్టర్‌ను చూస్తే అర్థమవుతుంది.
పోస్టర్‌ను గమనిస్తే.. సందీప్ కిషన్ ఓ చేతికి బేడీలు తగిలించి ఉన్నారు. అలాగే సందీప్ మరో చేతిలో నకల్స్ (ఇనుముతో చేసిన ఆయుధం)ను పట్టుకుని ఉన్నాడు. అతని చేతులకు, షర్టుకు రక్తం అంటుకుని ఉంది. పోస్టర్‌ను చూస్తుంటే మైఖేల్ సినిమా ఔట్ అండ్ ఔట్‌యాక్షన్ మూవీగా అనిపిస్తుంది. సందీప్ కిషన్ ఇలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి.
పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని రంజిత్ జెయకోడి తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా సిద్ధమవుతుంది. దర్శకుడు రంజిత్ ఓ డిఫరెంట్ స్క్రిప్ట్‌ను ప్రిపేర్ చేశారు. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇదొక స్పెషల్ మూవీగా నిలుస్తుందనిపిస్తుంది. భారీ స్కేల్‌లో రూపొందబోయే మైఖేల్ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.
నటీనటులు:సందీప్ కిషన్, విజయ్ సేతుపతి తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: రంజిత్ జెయకోడి
నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూరు రామ్మోహన్‌రావు
సమర్పణ: నారాయణ దాస్ కె.నారంగ్
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్