వినాయ‌క చ‌వితికి వస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని..

138

2021 మోస్ట్ అవెయిటింగ్ సినిమాల్లో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ ఒక‌టి. ‘నిన్నుకోరి’ వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో సినిమా తెర‌కెక్కింది. కోవిడ్ కారణంగా ఏర్ప‌డిన ప్ర‌తికూల ప‌రిస్థితుల వ‌ల్ల ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో డైరెక్ట్‌గా విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. వినాయ‌క చ‌వితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రం అమెజాన్‌లో విడుద‌ల‌వుతుంది.

‘‘పండగకి మన కుటుంబతో… మీ ‘టక్ జగదీష్’’’ అంటూ ఓ చిన్న డైలాగ్ వీడియోను నాని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో గ్లింప్స్‌లో నాని ‘‘భూదేవీపురం చిన్న కొడుకు, నాయుగార‌బ్బాయి ట‌క్ జ‌దీష్ చెబుతున్నాడు.. మొద‌లెట్టండి’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నిర్మాతలు ఈ చిత్రాన్ని పండ‌గ సంద‌ర్భంలో విడుద‌ల చేయాల‌ని ముందు నుంచి అనుకుంటున్నారు. వారి అనుకున్న‌ట్లే ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ను వినాయ‌క చ‌వితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుద‌ల చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి అదిరిపోయే ఆల్బ‌మ్‌ను అందించారు.

రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోది. ఐశ్వ‌ర్యా రాజేశ్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు ఈ చిత్రంలో నాని అన్న‌య్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందిన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ను షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

తారాగ‌ణం:నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్.
సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్‌ ముసులూరి
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌
పీఆర్.ఓ: వ‌ంశీ-శేఖ‌ర్‌