అన‌సూయ‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చిన సుకుమార్

528
anasuya Sukumar
- Advertisement -

యాంక‌ర్ అన‌సూయ బుల్లి తెర‌పై యాక‌రింగ్ తో పాటు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇటివ‌లే సుకుమార్ ద‌ర్వ‌క‌త్వంలో వ‌చ్చిన రంగ‌స్ధ‌లం సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈచిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అలాగే ఆమె పాత్ర‌కు మంచి గుర్తింపు కూడా వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆమె మ‌రో రెండు పెద్ద సినిమాల్లో న‌టిస్తుంది. ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న త‌ర్వాతి సినిమాను మ‌హేశ్ బాబుతో తీయ‌నున్నాడు.

sukumar Mahesh babu

ప్ర‌స్తుతం మ‌హేశ్ మ‌హ‌ర్షీ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ పూర్తి కాగానే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ప్రారంభంకానుంది. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం మ‌హ‌శ్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చే మూవీలో కూడా అన‌సూయ న‌టించ‌న‌నుంద‌ని స‌మాచారం. ఈమూవీలో అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. అన‌సూయ ప్ర‌స్తుతం వైయ‌స్సార్ యాత్ర సినిమాలో న‌టిస్తుంది. ఈమూవీ ఫిబ్ర‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -