అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ మూవీలో ర‌ష్మీక‌..

488
allu arjun Rashmika

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఫిబ్ర‌వ‌రి 14న ఈమూవీని లాంచ్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం స్ర్కీప్ట్ ను సిద్దం చేసే ప‌నిలో ఉన్నాడు త్రివిక్ర‌మ్. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్ధ‌లు సంయుక్తంగా ఈమూవీని నిర్మించ‌నున్నాయి. ఈమూవీలో న‌టించేందుకు క‌థానాయిక కోసం చూస్తున్నార‌ట చిత్ర యూనిట్. మొద‌ట కైరా అద్వాని ఖ‌రారు అయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

Allu Arjun Trivikram

తాజాగా మ‌రో హీరోయిన్ పేరు కూడా ఫిలీం న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఛ‌లో, గీతా గోవిందం మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మీక కూడా ఈచిత్రంలో న‌టించ‌నుంద‌ని తెలుస్తుంది. మ‌రోవైపు ఈమూవీలో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు అవ‌కాశం ఉంద‌ని అందుకే వీరిద్ద‌రి దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు టాక్. కైరా అద్వాని రామ్ చ‌ర‌ణ్ తో విన‌య విధేయ రామ చిత్రంలో న‌టించింది. ఈచిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ఎవ‌రూ న‌టిస్తారో తెలియాటంటే మ‌రికొద్ది రోజులు వెయిట్ చెయాల్సిందే.