సుఖోయ్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి..

29
- Advertisement -

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్‌ 30ఎంకేఐ యుద్ద విమానంలో ప్రయాణించారు. ఈ ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వైమానక స్థావరం నుంచి ఫ్లయింగ్ సూట్‌ ధరించి సుఖోయ్‌-30ఎంకేఐ విమానంలో విహరించారు. తొలుత తేజ్‌పూర్‌లోని వాయు సేన నుంచి సైనిక వందనం అందుకున్నారు. అనంతరం యుద్ధవిమానంలో ప్రయణించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్‌ కుమార్ తివారీ నడిపారు.

2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధవిమానంలో ప్రయణించారు. కానీ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం కూడా యుద్ధవిమానంను నడిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అస్సాం చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్క్‌లో జరిగిన గజ్‌ ఉత్సవ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మౌంట్ కాంచనగంగ సాహసయాత్ర-2023ను ఆమె ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి…

బొగ్గు బ్లాకుల వేలం..బీఆర్ఎస్ మహాధర్నా

గృహసారథులు.. వచ్చేస్తున్నారోచ్!

టీ హబ్‌ని సందర్శించిన ఎన్నారైల బృందం

- Advertisement -