సక్సెస్ కోసం సుధీర్ వేషాలు

25
- Advertisement -

సుధీర్ బాబు ఇండస్ట్రీకొచ్చి పదేళ్ళు దాటింది. ఈ యంగ్ హీరో హిట్స్ వేళ్ళ మీద లెక్కవేయొచ్చు. ప్రేమ కథా చిత్రం , భలే మంచి రోజు తర్వాత సుధీర్ బాబు కి మళ్ళీ హిట్ పడలేదు. మధ్యలో వచ్చిన సమ్మోహనం బాగున్నా కమర్షియల్ హిట్ అనిపించుకోలేకపోయింది. నన్ను దోచుకుందువంటే కమర్షియల్ గా జస్ట్ పరవాలేదనిపించుకుంది కానీ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. వీ , శ్రీదేవి సోడా సెంటర్ , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి , హంట్ ఇలా వరుస ఫ్లాఫ్స్ అందుకున్నాడు సుధీర్ బాబు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్ సినిమాలు సుధీర్ బాబు మార్కెట్ ను బాగా దెబ్బ తీశాయి. ఈ సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీంతో ఇప్పుడు సుధీర్ ఓ సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందు కోసం చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నాడు. మేటర్ లోకి వెళ్తే హర్ష వర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు మామా మశ్చీంద్ర అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు సుధీర్. అందులో రెండు లుక్స్ రివీల్ చేశారు మేకర్స్. లడ్డు బాబు దుర్గా గెటప్ తో ఎట్రాక్ట్ చేసి సినిమా మీద బజ్ క్రియేట్ చేశాడు. తాజాగా పరశురామ్ అనే మరో గెటప్ తో ఆకట్టుకున్నాడు. ఇంకో గెటప్ రావాల్సి ఉంది. అయితే వివిధ వేశాలతో సుధీర్ తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు బాగానే ఉంది. కానీ ఈ సినిమాతో అయినా నైట్రో స్టార్ కి హిట్ దక్కుతుందా ? చూడాలి. రైటర్ గా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్ దర్శకుడిగా సుధీర్ కి హిట్ ఇస్తాడేమో లేట్ సీ.

ఇవి కూడా చదవండి..

- Advertisement -